YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ముంబయి బాంబు పేలుళ్ల సూత్రధారి హఫీజ్‌ సయీద్‌ అరెస్టు

ముంబయి బాంబు పేలుళ్ల సూత్రధారి హఫీజ్‌ సయీద్‌ అరెస్టు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

ముంబయి బాంబు పేలుళ్ల సూత్రధారి, జమాత్‌ ఉద్‌ దవా చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌ను కౌంటర్ టెర్రరిజం డిపార్ట్‌మెంట్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఓ కేసు విచారణలో భాగంగా లాహోర్‌ నుంచి గుజ్రాన్‌వాలా వెళ్తున్న సయీద్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు అక్కడి నుంచి ఆయన్ని రహస్య ప్రాంతానికి తీసుకెళ్లినట్లు అధికారిక వర్గాల సమాచారం. మరోవైపు హఫీజ్‌ను జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించినట్లు పాక్‌ మీడియా వర్గాలు చెబుతున్నాయి.ఉగ్రమూకలకు ఆర్థిక సాయం అందించే విషయమై ఇటీవల పాక్‌పై అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో ఆ దేశం దిగిరాక తప్పలేదు. ఇందులో భాగంగానే సయీద్‌తో పాటు అతడి అనుచరులపై 23 కేసులు నమోదు చేశారు. ఉగ్రవాద కార్యకలాపాల కోసం ఐదు ట్రస్టుల ద్వారా నిధులు సేకరించినట్లు ఆరోపణలు రావడంతో వీరిపై కేసులు నమోదు చేశారు.లష్కరే తోయిబా అనుబంధ సంస్థే జమాత్‌ ఉద్‌ దవా. 2008 నవంబరులో ముంబయిలో ఉగ్రవాదులు మారణహోమం జరిగింది. ఈ దాడిలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి హఫీస్‌ జయీద్‌ సూత్రధారి. దీంతో ఐక్యరాజ్యసమితి అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. అతడి ఉగ్రవాదసంస్థను కూడా నిషేధిత సంస్థల జాబితాలో చేర్చింది. సయీద్‌పై అమెరికా 10 మిలియన్‌ డాలర్ల రివార్డును ప్రకటించింది.

Related Posts