Highlights
- సోషల్ మీడియా లో హల్ చల్
ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ తెరకెక్కనుంది. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగం అయినట్లు ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా పనిమీద ఆ ఇద్దరు హీరోలు అమెరికాకు వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ రాజమౌళితో జరిగే చర్చల్లో ఈ ఇద్దరు భాగం కానున్నట్లు ఫిలిం నగర్ భోగట్టా. ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కానీ అమెరికా టూర్ కి సంబంధించిన ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ అమెరికా గోలనో కాసేపు పక్క పెడితే... జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న కొత్త సినిమాలో నటిస్తున్నారు. ఇక మగధీరుడి రామ్ చరణ్ విషయానికి వస్తే ఇటీవలే 'రంగస్థలం'ను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీనివాస్ ట్రాకుక్కించనున్న సినిమాలో రామ్ చరణ్ నటించబోతున్నారు .
#Ramcharan & @tarak9999 Going to Los Angeles for @ssrajamouli 's Next Test Shoot.#NTRamcharan ????????#NTR #Rajamouli pic.twitter.com/BICFP1vwih
— Movies Updates (@moviesupdate_) March 7, 2018