Highlights
- పొత్తు వద్దంటే ఆలస్యం చేయొద్దు
- ఢిల్లీ నుంచి మంత్రి కామినేనికి తాఖీదు
అమరావతిలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణం వద్ద బుధవారం ఉదయం నుంచి రాజకీయ ఉత్కంఠత నెలకొంది. బీజేపీతో పొత్తును ఉపసంహరించుకుంటామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించిన వెంటనే మీ మీ పదవులకు రాజోనామా చేయమని అధిష్టానం కమలనాథులకు తాకేసులు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావుకు ఢిల్లీ నుంచి ఆదేశాలు అందాయి. దీంతో వెంటనే అమరావతిలో బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు. ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. కాగా... ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబుతో బీజేపీ మంత్రులు ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపారు. హైకమాండ్ ఆదేశాలు అలాగే ఉన్నాయని అయన స్పష్టం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో సభాపతితో సమావేశమై సాధ్యాసాధ్యాలను చర్చి ఆ మేరకు రాజీనామా చేయాలని హరివాబు సూచించినట్టుగా తెలుస్తోంది.