YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఆగస్టు 2 నుంచి అయోధ్య కేసు విచారణ

ఆగస్టు 2 నుంచి అయోధ్య కేసు విచారణ

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

అయోధ్య భూవివాద కేసులో మ‌ధ్య‌వ‌ర్తుల క‌మిటీ ఇవాళ నివేదిక‌ను సుప్రీంకోర్టుకు స‌మ‌ర్పించింది. మ‌ధ్య‌వ‌ర్తుల క‌మిటీ చైర్మ‌న్ జ‌స్టిస్ ఖ‌లీఫుల్లా నివేదిక‌ను కోర్టుకు స‌మ‌ర్పించిన‌ట్లు చీఫ్ జ‌స్టిస్ గ‌గోయ్ తెలిపారు. ఇక అయోధ్య కేసులో తుది విచార‌ణ ఆగ‌స్టు 2వ తేదీ నుంచి జ‌రుగుతుంద‌ని కోర్టు ఇవాళ పేర్కొన్న‌ది. జూలై 31వ తేదీలోగా ఈ కేసుకు సంబంధించి వివిధ వ‌ర్గాల అభిప్రాయాల‌ను వెల్ల‌డించాల‌ని కోర్టు చెప్పింది. మ‌ధ్య‌వ‌ర్తులు త‌మ అభిప్రాయాల‌ను వెల్ల‌డించాల‌ని జూలై 11వ తేదీన చీఫ్ జ‌స్టిస్ నేతృత్వంలోని అయిదుగురు స‌భ్యుల ధ‌ర్మాస‌నం ఆదేశించిన విష‌యం తెలిసిందే. మ‌ధ్య‌వ‌ర్తిత్వ క‌మిటీ త‌న సంపూర్ణ నివేదిక‌ను ఈనెల 25వ తేదీలోగా స‌మ‌ర్పించాల‌ని సుప్రీంకోర్టు ఇటీవ‌ల పేర్కొన్న‌ది. చీఫ్ జ‌స్టిస్ రంజ‌న్ గ‌గోయ్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం ఈ కేసులో వాద‌న‌లు విన్న‌ది. అయోధ్య భూ వివాదం కోసం మ‌ధ్య‌వ‌ర్తిత్వ ప్యానెల్‌ను ఏర్పాటు చేశామ‌ని, ఆ క‌మిటీ ఇచ్చే రిపోర్ట్ కోసం వేచి ఉండాల‌ని, మ‌ధ్య‌వ‌ర్తులు నివేదిక ఇచ్చే వ‌ర‌కు వేచి చూడండి అంటూ కోర్టు త‌న తీర్పులో తెలిపింది. ముస్లింల త‌ర‌పున సీనియ‌ర్ లాయ‌ర్ డాక్ట‌ర్ రాజీవ్ ధావ‌న్ కోర్టులో మాట్లాడారు. మ‌ధ్య‌వ‌ర్తిత్వ క‌మిటీల‌ను త‌ప్పు ప‌ట్టాల్సిన త‌రుణం ఇది కాద‌న్నారు. అయితే అయోధ్య కేసులో తీర్పును త్వ‌ర‌గా వెల్ల‌డించాల‌ని సీనియ‌ర్ లాయ‌ర్ కే ప‌ర‌స‌ర‌న్ పిటిష‌న్ వేశారు. మ‌ధ్య‌వ‌ర్తి నివ‌దిక‌తో ఒరిగేది ఏమీ ఉండ‌ద‌ని, ఈ కేసులో కోర్టే కొత్త తేదీని ప్ర‌క‌టించాల‌ని ఆయ‌న కోరారు. అయోధ్యలోని రామజన్మభూమి, బాబ్రీ మసీదు భూవివాదంపై సామరస్య పరిష్కారాన్ని కనుగొనేందుకు ఈ ఏడాది మార్చి 8న సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించిన విషయం విదితమే. సుప్రీంకోర్టు మాజీ జడ్జి ఎఫ్.ఎం.కలీఫుల్లా, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్, ప్రముఖ సీనియర్ అడ్వకేట్ శ్రీరామ్‌పంచు ఈ కమిటీలో సభ్యులుగా కొనసాగుతున్నారు.

Related Posts