YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

వివాదాస్పదంగా మారిన యడ్యూరప్ప వ్యాఖ్యలు నినాదాలతో ఒక్కసారిగా దద్దరిల్లిన అసెంబ్లీ

వివాదాస్పదంగా మారిన యడ్యూరప్ప వ్యాఖ్యలు     నినాదాలతో ఒక్కసారిగా దద్దరిల్లిన అసెంబ్లీ

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

కర్ణాటక అసెంబ్లీలో విశ్వాసపరీక్షపై జరుగుతున్న చర్చలో ప్రతిపక్ష నేత యడ్యూరప్ప వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.15మంది రెబల్ ఎమ్మెల్యేల విషయంలో సుప్రీం ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ.. 15మంది అసంతృప్త ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలా?వద్దా?అనేది వాళ్ల ఇష్టమని, అలాగే ఆ 15మంది ఎమ్మెల్యేలకు విప్ జారీ చేయకూడదని సుప్రీంకోర్టు చెప్పిందని యడ్యూరప్ప వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై స్పీకర్ వెంటనే అభ్యంతరం వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు అలా ఎక్కడ చెప్పిందని ప్రశ్నించారు.యడ్యూరప్ప వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో ఖండించారు. ఈ సందర్భంగా సభలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్ష- విపక్ష సభ్యులు పరస్పరం మాటల దాడికి యత్నించారు. సభ్యుల నినాదాలతో అసెంబ్లీ ఒక్కసారిగా దద్దరిల్లింది. అనంతరం కాంగ్రెస్ ముఖ్యనేత శివకుమార్ మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత యడ్యూరప్ప సుప్రీం కోర్టు ఏం చెప్పిందో కూడా తెలుసుకోకుండా సభను తప్పుదోవపట్టిస్తున్నారని విమర్శించారు. సుప్రీం కోర్టు తన తీర్పులో విప్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదని చెబుతూ ధర్మాసనం ఇచ్చిన తీర్పు కాపీని చూపించారు.సభలో గందరగోళం సర్దుమణిగాక.. యడ్యూరప్ప మాట్లాడుతూ.. విప్ విషయం సుప్రీం కోర్టు ప్రస్తావించలేదనే విషయాన్ని ఒప్పుకుంటున్నానని, తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నానన్నారు. కాంగ్రెస్ పక్షనేత ఆ పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసే ఆలోచనలో ఉంటే చేయొచ్చనిఆ విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు.

Related Posts