Highlights
- తొగాడియాకు తృటిలో తప్పిన ప్రమాదం
- తొగాడియాకు ప్రాణహాని
- వీహెచ్‌పీ ఆందోళన
విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ తొగాడియా తృటిలో ఘోర ప్రమాదం నుంచి బయటపడ్డారు. సూరత్‌కు సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారును భారీ ట్రక్ ఒకటి ఢీకొట్టింది.
తనను హతమార్చేందుకు కుట్ర పన్నారని విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ తొగాడియా ఆరోపించారు. జెడ్-ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నప్పటికీ పోలీసులు కనీసం ఎస్కార్ట్ టీమ్‌ను కూడా కేటాయించలేదన్నారు. బుధవారం జరిగిన ప్రదమయంలో ఆయన ప్రాణాపాయ పరిస్థితి నుబిచ్చి బయట పడ్డారు. సూరత్‌కు సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారును భారీ ట్రక్ ఒకటి ఢీకొట్టింది. ఆయన ప్రయాణిస్తున్న కారు బుల్లెట్ ప్రూఫ్ కావడంతో అందులో ఉన్న వారు సురక్షితంగానే బయటపడ్డారు. ఈ ప్రమాదంపై స్పందిస్తూ.. భద్రత నిర్లక్ష్యానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. తాను పాల్గొనే కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూల్‌ను పోలీసులకు తెలియజేసినట్లు ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా తొగాడియాకు ప్రాణహాని ఉందని వీహెచ్‌పీ ఆందోళన వ్యక్తం చేసింది.