YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

టోక్యో యానిమేషన్ స్టూడియోలో పేలుడు 23మంది మృతి

 టోక్యో యానిమేషన్ స్టూడియోలో పేలుడు 23మంది మృతి

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

 జపాన్‌ లోని టోక్యో నగరంలో యానిమేషన్ స్టూడియోలో జరిగిన పేలుడులో 23మంది చనిపోయారు. మ‌రో 35 మంది గాయ‌ప‌డిన‌ట్లు ఫైర్ డిపార్ట్‌మెంట్ అధికారులు చెప్పారు మొదటి అంతస్థులో ఈ పేలుడు సంభవించింది. ఉదయం 10.30 గంటల  ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఓ వ్య‌క్తి గుర్తు తెలియ‌ని ద్ర‌వాన్ని బిల్డింగ్‌లో పార‌పోశాడ‌ని, దాంతో భారీ స్థాయిలో మంట‌లు వ్యాపించిన‌ట్లు పోలీసులు చెబుతున్నారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. గాయపడ్డవారికి స్థానిక హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు.దాడి జ‌రిగింది. యానిమేష‌న్ స్టూడియో బిల్డింగ్‌లో భారీ స్థాయిలో మంట‌లు వ్యాపించాయి. మూడు అంత‌స్తుల బిల్డింగ్ నుంచి తెల్ల‌టి పొగ చెల‌రేగింది. స్టూడియోలోని మొద‌టి అంత‌స్తులో పేలుడు జ‌రిగిన్న‌ట్లు సాక్షులు చెబుతున్నారు. ఈ ఘ‌ట‌న‌లో ఓ అనుమానితున్ని అరెస్టు చేశారు.

Related Posts