యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
తమిళనాడులోని విల్లుపురంలోని అన్నా ఫ్లె ఓవర్ వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. మినీ వ్యాన్ - ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 14 మంది కార్మికులు కంచీపురం జిల్లా నుంచి తిరువూరు జిల్లాకు విద్యుత్ టవర్ల నిర్మాణ పనులకు ట్రక్కులో తరలివెళ్తున్నారు. కోయంబత్తూరు నుంచి చెన్నైకు వెళ్తున్న మినీ వ్యాన్‌లో 26 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. అయితే కల్లాకుర్చి వద్ద ఈ రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ట్రక్కు డ్రైవర్ ఎం. మణికండన్, వ్యాన్ డ్రైవర్ ఏ. రాజేంద్రన్‌తో సహా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే 14 మంది కార్మికుల్లో 11 మంది జార్ఖండ్‌కు చెందినవారు ఉన్నారు. ఈ ప్రమాదంతో కల్లాకుర్చి - సేలం జాతీయ రహదారిపై మూడుగంటల పాటు ట్రాఫిక్‌జాం ఏర్పడింది. కల్లాకుర్చి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.