యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
తాను గత జన్మలో బ్రిటన్ యువరాణి ప్రిన్సెస్ డయానానంటూ ఆస్ట్రేలియాలోని ఓ నాలుగేండ్ల బాలుడు చెబుతున్నాడు. అతని పేరు బిల్లీ కాంప్బెల్. ఆస్ట్రేలియాలోని ఓ టెలివిజన్ సంస్థలో వ్యాఖ్యాతగా పనిచేసే డేవిడ్ కాంప్బెల్ కొడుకు బిల్లీ కాంప్బెల్. ప్రిన్సెస్ డయానా 1997లో ఓ కారు ప్రమాదంలో చనిపోగా.. ఆతర్వాత 18 ఏండ్లకు బిల్లీ పుట్టాడు. రెండేండ్ల వయసులో ఉన్నప్పుడు డయానా ఫోటోను చూసిన బిల్లీ అది తానేనని చెప్పాడని డేవిడ్ తెలిపారు. డయానా కొడుకులైన ప్రిన్స్ విలియం, హ్యారీల విషయాలు.. జన్మించిన కొద్ది గంటలకే చనిపోయిన డయానా సోదరుడు జాన్ గురించి కూడా బిల్లీ చెప్పాడని డేవిడ్ అన్నారు.