Highlights
- జాతీయ స్థాయిలో జరిగే ఏ పరీక్షలకైనా సరే
- మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సుప్రీం కోర్టు
నీట్‌తో సహా అఖిల భారత స్థాయిలో జరిగే ఏ పరీక్షలకైనా ఆధార్ తప్పని సరికాదని సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వోటర్ ఐడీ, బ్యాంక్ ఖాతా, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టు, రేషన్ కార్డు వంటివి కూడా గుర్తింపు కార్డులుగా చూపించవచ్చని పేర్కొంది. గతంలో సీబీఎస్‌ఈ నీట్ పరీక్షలకు ఆధార్ కార్డును తప్పని సరి చేసింది. మరోపక్క సీబీఎస్‌ఈ నిర్వహించే నీట్ పరీక్షల దరఖాస్తు గడువు మార్చి 9తో ముగియనుంది. ఈ కేసుపై వాదనల సందర్భంగా అటార్ని జనరల్ కె.కె.వేణుగోపాల్ మాట్లాడుతూ.. జమ్ము కశ్మీర్, మేఘాలయా, అసోంలో వలే ఐడీ ప్రూఫ్‌లు చూపించి కూడా పరీక్షలు రాయవచ్చని తెలిపారు. దీంతో సుప్రీం నీట్‌కు ఆధార్ తప్పని సరికాదని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది.