YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

హోదాకు.. ప్యాకేజీకి తేడాలేదు.. 

Highlights

  • 14వ ఆర్థిక సంఘం ఇవ్వద్దండి
  • రెవెన్యూ లోటు చట్టంలో
  • కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్ల
     
హోదాకు.. ప్యాకేజీకి తేడాలేదు.. 

ప్రత్యేక హోదాకు.. ప్రత్యేక ప్యాకేజీకి పెద్దగా తేడాలేదు. ప్రస్తుతం ఏపీకి ప్రత్యే్క హోదా లేకున్నా 90శాతం నిధులిచ్చేలా నిర్ణయించామని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం అరుణ్ జైట్లీ మీడియాతో మాట్లాడుతూ.. "  14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇవ్వద్దని చెప్పిందని బంతిని రాష్ట్ర కోర్టులోకి జైట్లీ నెట్టేశారు. 14వ ఆర్థిక సంఘం 60:40 నిష్పత్తిలో నిధులు ఇవ్వాలని చెప్పింది. ప్రత్యేక పరిస్థితుల్లో ఏపీకి 90:10 నిష్పత్తిలో నిధులివ్వాలని నిర్ణయించామని చెప్పారు. ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల ఏం ఒరుగుతుంది..? అని జైట్లీ సూటిగా ప్రశ్నించారు.హోదా ద్వారా వచ్చే ప్రతి లబ్ధిని ప్యాకేజీ ద్వారా ఇస్తామని చెప్పారు. ఏపీకి ఉన్న రెవెన్యూ లోటు చట్టంలో ఉంది.. తప్పకుండా పూర్తి చేస్తాం" అని ఆయన హామీ ఇచ్చారు. మొత్తానికి ఏపీకి హోదా లేదని మరోసారి జైట్లీ స్పష్టం చేసేశారు. అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

Related Posts