ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ రెవిన్యూలోటును భరిస్తామని కేంద్రం హమీ ఇచ్చిన విషయాన్ని బీజేపీ రాష్ట్ర అదేక్షుడు, ఎంపీ కంభంపాటి. హరిబాబు గుర్తు చేశారు. 10 సంవత్సరాల పాటు రెవెన్యూలోటును భర్తీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పిన విషయాన్ని అయన ప్రస్తావించారు. ఏపీ రాష్ట్రానికి నిధుల కేటాయింపు విషయంలో బుధవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మీడియా సమావేశం ముగిసిన తర్వాత హరిబాబు న్యూఢిల్లీలో బుధవారం రాత్రి మీడియాతో మాట్లాడారు. ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపర్చిన అంశాలతో పాటు పొందుపర్చని అంశాలను కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందని హరిబాబు చెప్పారు.2015-16 ఏడాదికిగానూ ఆర్థిక సంఘం సుమారు రూ.6600 కోట్ల రూపాయలు వచ్చిందని అంచనా వేసిందని అన్నారు. రెవెన్యూ లోటును కేంద్ర ప్రభుత్వం భర్తీ చేస్తూనే ఉందని స్పష్టం చేశారు. 14 వ ఆర్థిక సంఘం సూచనల మేరకే కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతోందని అన్నారు. ఈ మూడేళ్ళలో ఏ రాష్ట్రానికి ఇవ్వని నిధులను ఏపీ రాష్ట్రానికి కేటాయించినట్టుగా పేర్కొన్నారు. కేంద్రం నుండి నిధులను రాబట్టేందుకు తాము అన్ని రకాలుగా ఒత్తిడి తెస్తున్నట్టు ఆయన గుర్తు చేశారు. పరిశ్రమల స్థాపన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా సాయం కోరితే తప్పకుండా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పిందని అన్నారు. అంటే కాకుండా విదేశాల నుంచి ఏపీ తేలికగా రుణాలు పొందడానికి కూడా కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తోందని చెప్పారు.
కేంద్రం నుండి నిధులను రాబట్టేందుకు తాము అన్ని రకాలుగా ఒత్తిడి తెస్తున్నట్టు హరిబాబు గుర్తు చేశారు.