అమెజాన్ చేసిన పొరపాటు, ఆ సంస్థకు భారీ నష్టాన్ని కలిగించింది. వివరాల్లోకి వెళితే, గత వారం అమెజాన్, ప్రైమ్ డే సేల్ ను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సేల్ లో పొరపాటున 13వేల డాలర్లు (సుమారు రూ. 9 లక్షలు) విలువైన ఓ కెమెరా రేటును 94 డాలర్లు (సుమారు రూ. 6500)గా ప్రకటించగా, ఓ వినియోగదారుడు కొన్నాడు. ఈ విషయం సోషల్ మీడియా పుణ్యమాని బయటకు వెల్లడి కావడంతో, అమెజాన్ లో కెమెరాను కొనేందుకు యూజర్లు ఎగబడ్డారు.