కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షీలా దీక్షిత్ అంత్యక్రియలు ముగిశాయి. శనివారం మధ్యాహ్నం ఆమె గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. షీలా దీక్షిత్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. ఆమె మృతి పట్ల పార్టీలకు అతీతంగా నాయకులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఇవాళ ఢిల్లీలోని నిగమ్ బోధ్ శ్మశానవాటికలో అధికార లాంఛనాలతో షీలా దీక్షిత్ అంత్యక్రియలు నిర్వహించారు. ఢిల్లీలో భారీ వర్షం కురుస్తున్నా, భారీ సంఖ్యలో నేతలు, అభిమానులు తరలివచ్చారు.