YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఎలక్ట్రిక్ వాహానాలకు కేంద్రం వరాలు

ఎలక్ట్రిక్ వాహానాలకు  కేంద్రం వరాలు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

వాహనదారులకు మరో తీపికబురు. కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలపై (ఈవీ) జీఎస్‌టీ రేటు తగ్గించాలని భావిస్తోంది. జూలై 25న జరగనున్న జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో దీనికి సంబంధించి ఒక నిర్ణయం వెలువడవచ్చు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక వీడియో కాన్ఫరెన్స్‌లో 36వ జీఎస్‌టీ సమావేశం జూలై 25న జరుగుతుందని తెలిపారు. నిర్మలా అధ్యక్షతన జరగనున్న రెండో జీఎస్‌టీ సమావేశం ఇది. జూన్ 21న ఈమె అధ్యక్షతన ఒక జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. జూలై 25 నాటి సమావేశంలో ఫిట్‌మెంట్ కమిటీ ప్రతిపాదనలను జీఎస్‌టీ కౌన్సిల్ పరిగణలోకి తీసుకోనుంది. ఇదే జరిగితే ఎలక్ట్రిక్ వెహికల్స్‌పై జీఎస్‌టీ రేటును 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించడం, ఈవీ చార్జర్లపై రేటును 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించడం వంటి నిర్ణయాలు వెలువడే అవకాశముంది. జీఎస్‌టీ రేటు తగ్గిస్తే.. ఒకే నెలలో ఎలక్ట్రిక్ వాహనాలకు రెండు శుభవార్తలు అందినట్లు అవుతుంది. ఆర్థిక మంత్రి తన తొలి బడ్జెట్‌లో ఆదాయపు పన్ను ప్రయోజనాలు కల్పిస్తామని ప్రకటించారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలుకు తీసుకున్న రుణాలపై చెల్లించే వడ్డీలో రూ.1.5 లక్షల వరకు డిడక్షన్ పొందొచ్చని తెలిపారు.

Related Posts