YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రెండో విడత కిసాన్ పథకానికి నిధులు విడుదల

రెండో విడత కిసాన్ పథకానికి నిధులు విడుదల

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం పీఎం కిసాన్ పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 14 కోట్ల మంది అర్హులైన రైతులకు ఈ స్కీమ్‌ను వర్తింపజేస్తామని తెలిపింది. ప్రధాని మోదీ ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కోసం ఏకంగా రూ.75,000 కోట్లను కేటాయించింది. రాష్ట్రాల చర్యల కారణంగా కేంద్రానికి రూ.12,000 కోట్లు ఆదా అవుతోంది. పథకానికి అర్హులైన రైతుల వివరాలను కేంద్రానికి అందించడంలో రాష్టాలు అలసత్వం ప్రదర్శించడం ఇందుకు కారణం. పశ్చిమ బెంగాల్ ఈ స్కీమ్‌లో పాల్గొనడం లేదు. ఢిల్లీది కూడా ఇదే దారి. ఇక బీహార్, మధ్యప్రదేశ్ వంటి ప్రధాన రాష్ట్రాలు ఇప్పటి వరకు కేవలం వరుసగా 11 శాతం, 9 శాతం మంది రైతుల వివరాలనే కేంద్రానికి అందించాయి. ఏప్రిల్ నుంచి జూలై ఇప్పటి వరకు చూస్తే కేవలం 8 కోట్ల మంది రైతుల మాత్రమే స్కీమ్‌లో చేరారు. అంటే ఇంకా 5.8 కోట్ల మంది అర్హులైన రైతులకు ప్రయోజనాలు అందాల్సి ఉంది. ఈ లెక్కన చూస్తే కేంద్రానికి కేటాయించిన నిధుల్లో రూ.12,500 కోట్లు ఆదా కావొచ్చు. జూలై 31లోపు వివరాలు అందించిన రైతులకు మాత్రమే ఏప్రిల్-జూలైకు సంబంధించిన రెండో విడత రూ.2,000 మొత్తాన్ని అందిస్తామని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. కేంద్రం ఈ స్కీమ్ కింద ప్రతి రైతుకు ఏడాదికి రూ.6,000 చొప్పున  అందిస్తున్న విషయం తెలిసిందే. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌ రైతుల వివరాలను త్వరితగతిన అప్‌లోడ్ చేస్తోంది. జూన్ 25 వరకు చూస్తే.. పీఎం కిసాన్ లబ్ధిదారుల్లో ఏపీ రెండో స్థానంలో ఉంది. రాష్ట్రంలో 34.92 లక్షల మంది బెనిఫీషియర్స్ ఉన్నారు. అగ్రస్థానాన్ని ఉత్తరప్రదేశ్ సొంతం చేసుకుంది. ఇక మహరాష్ట్ర, గుజరాత్, రాజస్తాన్ రాష్ట్రాలు వరుసగా టాప్ 5లో ఉన్నాయి.

Related Posts