యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీతో పాటు కేంద్రమంత్రులు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, ఆయా రాష్ర్టాల సీఎంలు ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. ఈ ప్రత్యేక క్షణాలు చరిత్రలో లిఖించబడుతాయి. ప్రతి భారతీయుడు గర్వించదగ్గ రోజు ఈ రోజు అని మోదీ పేర్కొన్నారు. చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతం మన శాస్త్రవేత్తల యొక్క శక్తిని తెలియజేస్తుంది. చంద్రయాన్-2 పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడింది.. దీనికి ప్రతి భారతీయుడు సంతోషించాలి. రోవర్ చంద్రుని ఉపరితలంపై పదార్థాలను విశ్లేషించనుంది అని మోదీ పేర్కొన్నారు.