యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
చంద్రుడు శ్వేతవర్ణుడు. ప్రశాంత మనస్సుకు సంకేతం. నీట జాడలున్న సోముడి వేటలో ఇస్రో చరిత్రాత్మక మైలురాయిని అందుకున్నది. అగ్రరాజ్యాల సరసన మన ఇస్రో నిలిచింది. చందమామపై ఇక మన మువ్వన్నెల త్రివర్ణ పతాకం రెపరెపలాడనున్నది. వెయ్యి కోట్ల చంద్రయాన్2 మిషన్‌ను ఇవాళ ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. భూకక్ష్యలోకి చంద్రయాన్2 అనుకున్నట్లే చేరుకున్నది. ఈ విషయాన్ని ఇస్రో చైర్మన్ శివన్ ద్రువీకరించారు. భూ కక్ష్యలోనే చంద్రయాన్ 23 రోజులు భ్రమిస్తుంది. ఆ తర్వాతే చంద్రుడి కక్ష్యలోకి వెళ్తుంది. అన్నీ అనుకున్నట్లే జరిగితే.. ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీన జాబిలిపై విక్రమ్ ల్యాండర్ దిగుతుంది. ఇక ఆ క్షణం చంద్రుడు త్రివర్ణ శోభితుడవుతాడు. విక్రమ్ ల్యాండర్‌పై చిన్నసైజు జాతీయ జెండాను ఇస్రో శాస్త్రవేత్తలు అమర్చారు. ఇక రోవర్‌కు చెందిన ఓ చక్రంపై అశోక చక్ర, మరో చక్రంపై ఇస్రో లోగో ఉంటుంది.