YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బిజెపితో పెటాకులైన టీడీపీ పొత్తు

Highlights

  • సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
  • ప్రధానికి ఫోన్ చేసి చెప్పనున్న బాబు
  • రాజీనామా చేయనున్న టీడీపీ మంత్రులు
బిజెపితో పెటాకులైన టీడీపీ పొత్తు

ఆంధ్ర ప్రదేశ్ కు  జరిగిన అన్యాయం నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా  చంద్రబాబు నాయుడు సంచనాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు.  ఈ విషయంలో రెండు రోజులుగా నెలకొన్న ఉత్కంఠతకు ముగింపు పలికారు. ఆ పార్టీ సీనియర్ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చెప్పినట్టుగానే అక్షరాలా జరిగింది. బిజెపితో టీడీపీ పొత్తు పెటాకులైంది. మొత్తం మీద  కేంద్ర మంత్రి వర్గం నుంచి  బయటకు రావాలని టీడీపీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కొంచెం సేపట్లో టీడీపీ మంత్రులు రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది. కాగా, కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు అందుబాటులో లేకపోవడంతో ఈ నిర్ణయాన్ని ఆయనకు తెలియజేయనున్నారు. కేంద్రం నుంచి టీడీపీ వైదొలగనున్న నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి చంద్రబాబు చెప్పనున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. కాగా, కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన అనంతరం, టీడీపీ ఎంపీలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేద్దామనే దాదాపు అందరూ ఎంపీలు చెప్పారని,ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 

Related Posts