యువ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:
అమలాపాల్ నాయికగా ఇటీవల వచ్చిన 'ఆమె' సినిమా బాక్సాఫీసు వద్ద నిరాశపరచింది. తమిళ వెర్షన్ తో పాటు తెలుగు వెర్షన్ కీ ఆదరణ దక్కలేదు. అయితే, ఈ సినిమా విషయంలో అమలాపాల్ తన గొప్పతనాన్ని చాటుకుందట. సినిమా విడుదలకి ముందు నిర్మాత ఫైనాన్షియర్లకి డబ్బు చెల్లించలేకపోవడంతో అమలాపాల్ తన పారితోషికాన్ని వెనక్కి ఇచ్చేయడమే కాకుండా, మరికొంత డబ్బు కూడా సర్దుబాటు చేసి సినిమా విడుదలకి సహకరించిందట. ఈ విషయాన్ని చిత్రాన్ని తెలుగులో విడుదల చేసిన తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు.