YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

పాపం షమీ..

Highlights

  • వ్యక్తిగతంగానే కాదు..
  • వృత్తిగతంగానూ చుక్కెదురే
పాపం షమీ..

టీమిండియా క్రికెటర్‌ మహ్మద్‌ షమీకి బీసీసీఐ సైతం భారీ షాకిచ్చింది. భార్య హసిన్‌ జహాన్‌ చేసిన తీవ్ర ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న షమీని తాజాగా బిసిసిఐ కూడా దూరం పెట్టింది.మరో   వైపు భారత క్రికెటర్ల కాంట్రాక్టు ప్యాకేజీలు భారీగా పెంచుతూ బీసీసీఐ ప్రకటన చేయగా.. షమీని మాత్రం తప్పించింది. తాజా కాంట్రాక్టు ఆటగాళ్ల జాబితాలో ఏ కేటగిరిలోనూ బౌలర్‌ షమీ పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. గాయాలబారిన పడుతున్నా నిలకడైన ప్రదర్శనతో కీలక సిరీస్‌లకు షమీ ఎంపికయ్యేవాడు. కానీ నేడు పునరుద్ధరించిన తాజా కాంట్రాక్టులో మాత్రం షమీకి మొండిచేయి లభించింది. వ్యక్తిగతంగానే కాదు, వృత్తిగతంగానూ షమీకి బుధవారం ఏమాత్రం కలిసిరాలేదు.

Related Posts