Highlights
- మారిన ఏపీ రాజకీయ ముఖచిత్రం
- టీడీపీ కేంద్ర మంత్రులు రాజీనామా..
- చంద్రబాబు వెల్లడి..
గత నాలుగేళ్లగా బిజెపితో మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఆ పార్టీతో సంబంధాలను తేంచేసుకుంది అందులో భాగంగానే ఇద్దరు కేంద్ర మంత్రులు రాజీనామా చెయ్యిమని ఎపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో తెగతెంపులు చేసుకున్నామని స్పష్టం చేశారు. కేంద్రం ఆంధ్రప్రదేశ్ ను అవమానిస్తూ వచ్చింది ఎన్ని అవమానాలు పడిన ఆంధ్రాకు మేలు జరగాలి అనే ఒక్క విషయం కోసం గత నాలుగేళ్లగా ఓపికగా, సహనంతో ఉన్నానని చంద్రబాబు తెలిపారు. బుధవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. అరుణ్ జైట్లీ ఆడిన మాటలు తన మనసుకు ఎంతో బాధ కలిగించాయని ఆవేదన చెందానన్నారు.ప్రతిపక్షంలో ఉండి కూడా ఎక్కడా తప్పు చేయలేదని అయినప్పటికీ కేంద్రం ఎందుకిలా చేసిందని ముఖ్యమంత్రి ఒకింత అసహనాన్ని వ్యక్తం చేశారు
కేంద్ర మంత్రులు రాజీనామా అనంతరం కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే కేంద్రంలో చేరామన్నారు. 29 సార్లు ఢిల్లీకి వెళ్లి ఆంధ్ర ప్రజలు పడుతున్న బాధలను చెప్పినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా బాధాకరమన్నారు.జైట్లీ మాటలు చూస్తే సహాయం చేసే ఉద్దేశం కనిపించలేదన్నారు.సినియర్ ముఖ్యమంత్రిగా ఉండి కూడా నాలుగు సంవత్సరాలు ఓపిక పట్టాల్సిన అవసరం వచ్చింది కేవలం రాష్ట్ర ప్రజల ఉపయోగాలకు మాత్రమే అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయం కోసం మాత్రమే పదేపదే కేంద్రానికి చెప్పాం కానీ ఎక్కడా భేషిజాలకు పోలేదని చంద్రబాబు చెప్పారు.ఈ సమావేశం పెట్టకముందే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఈ విషయాన్ని చెప్పాలని ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదన్నారు. దీనితో విషయాన్నంతా ప్రధాని ఓఎస్డ్ కి చెప్పానని చంద్రబాబు నాయుడు చెప్పారు
.
#WATCH Andhra Pradesh CM N Chandrababu Naidu briefs the media in Amaravati https://t.co/0XlA0CPi4b
— ANI (@ANI) March 7, 2018