Highlights
- 15 నుంచి టెన్త్ పరీక్షలు
- పరీక్షల విభాగం డైరెక్టర్ వీఎస్ భార్గవ
పదవ తరగతి పరీక్షలు రాసే అభ్యర్థులు తమ హాల్ టికెట్లను గురువారం నుంచి www.bseap.org వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ వీఎస్ భార్గవ సూచించారు. ఈ నెల 15న ప్రారంభం కానున్న పరీక్షలు.. ఉదయం 9.30 నుంచి 12.15 గంటల వరకు జరుగుతాయన్నారు. హాల్ టికెట్లు అందని అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని ప్రధానోపాధ్యాయుని నుంచి అటెస్ట్ చేయించుకోవాలన్నారు.