యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులు, అవిభక్త హిందూ కుటుంబాలు (హెచ్‌యూఎ్‌ఫ) ఐటీ రిటర్న్‌లు ఫైల్ చేయాల్సిన గడువును నెల రోజులు పొడిగించారు. నిజానికి ఈ రిటర్న్‌లను ఈ నెల 31 తేదీలోగా సమర్పించాలి. అయితే ఈ గడువును ఆగస్టు 31 వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రత్యక పన్నుల బోర్డు (సీబీడీటీ) ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. దీంతో ఐటీ రిటర్న్‌ల ఫైలింగ్ గడువు దగ్గర పడిందని హడావుడి పడుతున్న వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులకు పెద్ద ఊరట లభించింది.