యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:
'డియర్ కామ్రేడ్' సినిమాలో నా పాత్రకి నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను..' అంటోంది కథానాయిక రష్మిక. 'నా పాత్రకి వేరొకరు చెబితే సరిగ్గా అతకదేమో అనిపించి, దర్శకుడ్ని అడిగాను. ఆయన ఓకే అనడంతో చెప్పాను. మీరు నమ్ముతారో లేదో కానీ, డబ్బింగ్ పూర్తిచేయడానికి 60 రోజులు పట్టింది.. నాకు తెలుగు రాదు కదా, అందుకే అంత టైం తీసుకున్నాను' అని చెప్పింది రష్మిక.