YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రాజేష్.. సోనియా పాండే కు కొత్త సమస్య

 రాజేష్.. సోనియా పాండే  కు కొత్త సమస్య

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

లింగ మార్పిడి ఆపరేషన్ చేసుకున్న ఒక 35 ఏళ్ల రైల్వే ఉద్యోగికి రైల్వేలో తన అధికారిక రికార్డులలో వివరాలను మార్చుకోవడం సమస్యగా మారింది. స్త్రీగా మారిన ఆ పురుష ఉద్యోగికి పాత గుర్తింపు కార్డు, ఇతర పత్రాలు అవే కొనసాగుతుండడంతో విధులు నిర్వర్తించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఇజ్జత్‌నగర్(బరేలీ) వర్క్‌షాప్‌లో గ్రేడ్ 1 టెక్నీషియన్‌గా పనిచేస్తున్న 35 ఏళ్ల రాజేశ్ పాండే తన పేరును సోనియా పాండేగా, తన జెండర్‌ను స్త్రీగా మార్చాలని కోరుతూ గోరఖ్‌పూర్‌లోని ఈశాన్య రైల్వే జనరల్ మేనేజర్ కార్యాలయానికి అర్జీ పెట్టుకోగా రైల్వేల చరిత్రలో ఇటువంటి దరఖాస్తు రావడం ఇదే ప్రథమం కావడంతో ఏం చేయాలో అర్థం కాక దీన్ని పై అధికారులకు నివేదించారు.ఇదో సాంకేతిక సమస్యని, దీంట్లో న్యాయపరమైన అంశాలను పరిశీలిస్తున్నామని ఈశాన్య రైల్వే పీఆర్‌ఓ సిపి చౌహాన్ చెబుతున్నారు. నలుగురు సోదరీమణులకు ఏకైక సోదరుడైన రాజేశ్ పాండే తన తండ్రి మరణానంతరం 2003లో కారుణ్య నియామకంలో ఉద్యోగం లభించింది. 2017లో లింగ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకోవడానికి ముందు అతని ఒక స్థానిక మహిళతో వివాహమైంది. అయితే పెళ్లయిన ఏడాదికే వారు విడాకులు తీసుకున్నారు. పురుష శరీరంలో ఉండేందుకు తన మనసు ఒప్పుకోకపోవడం వల్లనే తాను స్త్రీగా మారిపోయానని రాజేశ్..ఉరఫ్ సోనియా పాండే అంటోంది. రోజూ ఆఫీసుకు ఫుల్ మేకప్ చేసుకుని, చీర లేదా స్త్రీలు ధరించే ఇతర దుస్తులతో వెళుతున్న
రాజేశ్‌తో ఆఫీసులో సహోద్యోగులు మామూలుగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.

Related Posts