YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జనసేనాని వెరీ వెరీ బిజీ 

Highlights

  • మంతనాల్లో బీజేపీ 
  • టచ్ లోకి కీలక నేత 
  • మల్లాగుల్లాల్లో టీడీపీ 
జనసేనాని వెరీ వెరీ బిజీ 

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బుధవారం నాడు పగలంతా చాలా బిజీ బిజీగా గడిపారు. ఒకవైపు సభ సన్నాహాలు.. మరోవైపు మీడియా వారితో భేటీలు ఇలా ఆయన పగలు కాల్షీట్ మొత్తం గడచిపోయింది. అర్ధరాత్రి సమయంలో కూడా.. ఇవాళ ఆయన బిజీబిజీగానే గడిపినట్లుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రంలోని భాజపాతో కటీఫ్ చెప్పేయగానే.. పవన్ కల్యాణ్ కు కూడా నిద్రాభంగం అయింది. ఈ రాజకీయ పరిణామం గురించిన సమచారం ఆయనకు అందింది. అక్కడినుంచి ఆయన స్థాయిలో  మంత్రాంగం మొదలైనట్లుగా తెలుస్తోంది.

రాష్ట్రంలోని ఒక కీలక భాజపా నాయకుడు, మంత్రి అర్థరాత్రి సమయంలో పవన్ కల్యాణ్ కు టచ్ లోకి వచ్చినట్లుగా సమాచారం. పవన్ కల్యాణ్ కు ఎంతో సన్నిహితుడిగా పేరున్న సదరు మంత్రి.. గురువారం పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు తాను చంద్రబాబు కేబినెట్ నుంచి తప్పుకోవాలా? లేదా భిన్నమైన ప్రకటనతో రాజీనామా చేయకుండా మిన్నకుండిపోవాలా? అనే విషయంలో ఆయన పవన్ కల్యాణ్ అభిప్రాయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా పవన్ పార్టీని యాక్టివేట్ చేశాక.. ఆయన జనసేనలోకి రావచ్చుననే ప్రచారం చాలా కాలంగా ఉంది. ఆ మంత్రి ఇప్పుడు కేబినెట్ నుంచి తప్పుకోవడానికే విముఖంగా ఉన్నారనేది సమాచారం.నిజానికి పవన్ కల్యాణ్ బుధవారం మీడియా భేటీలోనే.. చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చే నిర్ణయాన్ని ధైర్యంగా తీసుకోలేకపోతున్నారంటూ తన అసంతృప్తిని వ్యక్తంచేశారు. ఆయన క్రియాశీలంగా పోరాడాలి తప్ప.. ఇంకా ఎదురుతెన్నులు అనవసరం అనే అభిప్రాయమూ వ్యక్తంచేశారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత.. ఆ నిర్ణయం వచ్చేసే సరికి.. ఇక భవిష్య రాజకీయ పరిణామాల వ్యూహరచన అర్ధరాత్రిలోనే ప్రారంభం అయిపోయినట్లుగా తెలుస్తోంది.

కేంద్రం నుంచి తెదేపా తప్పుకున్న నేపథ్యంలో గురువారం ఉదయమే తెలుగుదేశం ప్రభుత్వం నుంచి భాజపా కూడా తప్పుకోబోతున్నది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు మంత్రులు కూడా రాజీనామా చేసేస్తారు. అయితే.. బుధవారం నాడే వీరిద్దరూ రాజీనామా చేస్తారని.. చంద్రబాబు సభలో ప్రసంగాన్ని బట్టి అది ఆధారపడి ఉంటుందని, ఆ మేరకు వారికి ఢిల్లీనుంచి ఆదేశాలు వచ్చాయని పలు పుకార్లు వచ్చాయి. మంత్రి కామినేని స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి వీటిని ఖండించాల్సి వచ్చింది. అయితే ఆ పర్వం కూడా గురువారం ఉదయమే పూర్తికానుంది.ఇక్కడ ట్విస్టు ఏంటంటే.. రాష్ట్రంలోని ఒక కీలక భాజపా నాయకుడు, మంత్రి అర్థరాత్రి సమయంలో పవన్ కల్యాణ్ కు టచ్ లోకి వచ్చినట్లుగా సమాచారం. పవన్ కల్యాణ్ కు ఎంతో సన్నిహితుడిగా పేరున్న సదరు మంత్రి.. గురువారం పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు తాను చంద్రబాబు కేబినెట్ నుంచి తప్పుకోవాలా? లేదా భిన్నమైన ప్రకటనతో రాజీనామా చేయకుండా మిన్నకుండిపోవాలా? అనే విషయంలో ఆయన పవన్ కల్యాణ్ అభిప్రాయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

Related Posts