YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

పాకిస్తాన్ లో 40 వేల మంది ఉగ్రవాదులు

పాకిస్తాన్ లో 40 వేల మంది ఉగ్రవాదులు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

ఉగ్రవాదానికి పాకిస్తాన్ అడ్డాగా మారిందని ఒప్పుకుంది. తమ భూభాగంలో ఉగ్రవాద స్థావరాలపై పాక్ ఎట్టకేలకు నోరువిప్పింది. ఇన్నాళ్లూ ఎలాంటి ఉగ్రవాద సంస్థలూ లేవని బుకాయించిన దాయాది అంతర్జాతీయ సమాజం ముఖ్యంగా అమెరికా నుంచి వస్తున్న ఒత్తిడితో నిజాన్ని ఒప్పుకోకతప్పలేదు. 40వేల మంది ఉగ్రవాదులు కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్వయంగా వెల్లడించారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ పీస్ ఇన్‌స్టిట్యూట్‌లో ఆయన మాట్లాడారు. దాదాపు 40వేల మంది ఉగ్రవాదులు ఉన్నట్లు వారిని ఏరిపారేయాలనుకున్నట్లు ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. 40కు పైగా ఉన్న ఉగ్రవాద సంస్థల్లో లష్కరే తోయిబా, లష్కరే ఉమర్, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి ప్రధాన సంస్థలు దాడులు జరుపుతున్నాయి. వీటితో పాటుగా కొత్తవి కూడా పుట్టుకొస్తున్నాయి. గత ప్రభుత్వాలు ఉగ్రవాదుల గురించి చెప్పిన వాటిపై విరుద్ధంగా స్పందించారు ఇమ్రాన్. పాకిస్తాన్ లోని మిలటరీ బేస్డ్ స్కూల్లో ఉగ్రవాదుల దాడుల ఫలితంగా 150మంది చిన్నారులు చనిపోయారు. అప్పటి నుంచి ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ముంబై బ్లాస్ట్ కీలక సూత్రధారిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. అమెరికా వంటి అగ్రదేశంతో సత్సంబంధాలు కొనసాగించాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. పాక్ శాంతి కోరుకుంటుందని తామే స్వయంగా ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. వీటికి అమెరికా మాత్రం తాము ఎటువంటి సహాయం చేయాలన్నా.. ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తేనే తాము ముందుకొస్తామని స్పష్టం చేసింది.

Related Posts