YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

ఎస్ బీఐలో అకౌంట్ ఉంటే... ఇన్సూరెన్స్

ఎస్ బీఐలో అకౌంట్ ఉంటే... ఇన్సూరెన్స్

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

దేశీ దిగ్గజ ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో అకౌంట్ ఉందా? అలాగే మీరు రైల్వే ఉద్యోగం చేస్తున్నారా? అయితే మీకు శుభవార్త. ఏకంగా రూ.30 లక్షల ఇన్సూరెన్స్‌ను ఉచితంగా పొందొచ్చు. రైల్వేలో ఉద్యోగం చేస్తూ శాలరీ అకౌంట్‌ను ఎస్‌బీఐ‌లో కలిగి ఉంటే.. ఈ సదుపాయం పొందొచ్చు. రైల్వే ఉద్యోగుల ఎస్‌బీఐ శాలరీ అకౌంట్‌ను రైల్వే శాలరీ ప్యాకేజ్ (ఆర్ఎస్‌పీ) అని పిలుస్తారు. ఈ అకౌంట్ కలిగిన వారికి బ్యాంక్ ఉచిత ఇన్సూరెన్స్‌తోపాటు వివిధ రకాల సేవల అందిస్తోంది. అవేంటో చూద్దాం.. ఇండియన్ రైల్వేస్, కోల్‌కత్తా మెట్రో, కొంకన్ రైల్వే కార్పొరేషన్, ముంబై మెట్రో, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్, బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ ఉద్యోగులు ఎస్‌బీఐ రైల్వే శాలరీ అకౌంట్‌ను ఓపెన్ చేయవచ్చు. ఉద్యోగి నెలవారీ వేతనం ప్రాతిపదికన అంకౌట్ మారుతుంది. రూ.10 వేల నుంచి రూ.25,000 మధ్యలో వేతనం ఉంటే సిల్వర్ అకౌంట్ వస్తుంది. అదే రూ.25 వేల నుంచి రూ.50,000 మధ్యలో జీతం వస్తే గోల్డ్ అకౌంట్ ప్రారంభించొచ్చు. ఇక రూ.50 వేల నుంచి రూ.1,00,000 మద్యలో వేతనం ఉంటే డైమండ్ అకౌంట్ లభిస్తుంది. ఇక రూ.లక్ష పైన జీతం వస్తే ప్లాటినమ్ అకౌంట్ తెరవొచ్చు.
అకౌంట్ ప్రయోజనాలు..
✺ ఇది జీరో బ్యాలెన్స్ అకౌంట్. ఏ బ్యాంకు చెందిన ఏటీఎంలలోనైనా ఎన్ని సర్లైనా డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఎలాంటి చార్జీలు ఉండవు. అకౌంట్‌తోపాటు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు కూడా వస్తుంది.
✺ రూ.20 లక్షల వరకు కాంప్లిమెంటరీ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ (డెత్) కవర్ లభిస్తుంది. అలాగే రూ.30 లక్షల వరకు ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ (డెత్) కవర్ వస్తుంది.
✺ పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్‌ను ఆకర్షణీయ వడ్డీ రేటుకే పొందొచ్చు. అలాగే ప్రాసెసింగ్ ఫీజులో 50 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది.
✺ లాకర్ చార్జీలపై 25 శాతం వరకు డిస్కౌంట్ కూడా ఉంది. డీమ్యాట్, ఆన్‌లైన్ ట్రేడింగ్ అకౌంట్ పొందొచ్చు.
✺ డ్రాఫ్ట్స్, మల్టీ సిటీ చెక్స్, ఎస్ఎంఎస్ అలర్ట్స్ వంటి సేవలు ఉచితం. అలాగే నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ చార్జీలు ఎలాగో లేవు.
✺ ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కూడా ఉంది. రెండు నెలల నెట్ శాలరీకి సమానమైన మొత్తాన్ని తీసుకోవచ్చు. ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది

Related Posts