YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

కనులు తెరిచిన క్షణం నుండి..

Highlights

  •  కార్యేషు దాసి!
  • కరణేషు మంత్రి !!
  • భోజ్యేషు మాతా !!!
  • అంటూ  ఎక్కడ స్త్రీలు గౌరవించ బడతారో!
  • అక్కడ దేవతలు ప్రత్యక్షమవుతారనే సూక్తి.
కనులు తెరిచిన క్షణం నుండి..

అందుకే 
స్త్రీ లేకపోతే "జననం" లేదు.
స్త్రీ లేకపోతే "గమనం" లేదు.
స్త్రీ లేకపోతే స్రుష్టిలో "జీవం"లేదు.
స్త్రీలేకపోతే అసలు" స్రుష్టే" లేదు.....అందుకే 
కర్తవు నీవే!
కర్మవు నీవే!!
ఈ జగమంతా నీవే!!!
అందుకే ఆ భగవంతుడు నిన్ను స్రుష్టించాడు.
స్త్రీ-తల్లిగా,
స్త్రీ-చెల్లిగా,
స్త్రీ-ఇల్లాలిగా
అందుకే స్త్రీ ని గౌరవించుకుందాం(బ్రతికించుకుందాం) 

        
బంధం కోసం!
బాధ్యత కోసం!!
కుటుంబం కోసం!!!
అందరినీ కనుపాపలా తలచి,
ఆత్మీయతను పంచి,
తన వారికోసం అహర్నిషలు కష్టించి,
వారి కళల్ని పోషించి,
అవమానాలను సహించి,వారిభవిష్యత్ గురించి,
తన ఇంటిని నందనం చేసే "స్త్రీ మూర్తులకు" వందనం
స్త్రీ ఎలా ఉండాలో అనే కాదు...పురుషుడు ఎలా ఉండాలో కూడా ధర్మ శాస్త్రం చెప్పింది..కానీ ఎందుచేతో ఈ పద్యం జన బాహుళ్యంలో లేదు.

           కార్యేషు యోగీ, కరణేషు దక్షః 

         రూపేచ కృష్ణః క్షమయా తు రామః

         భోజ్యేషు తృప్తః  సుఖదుఃఖ మిత్రం

         షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః (కామందక నీతిశాస్త్రం)

కార్యేషు యోగీ : పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి. 
కరణేషు దక్షః  కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో  నేర్పుతో, సంయమనంతో వ్యవహరించాలి. సమర్ధుడై ఉండాలి.
రూపేచ కృష్ణః రూపంలో కృష్ణుని వలె ఉండాలి. అంటే (ఎనిమిది పెళ్ళిళ్ళు చేసుకోమని కాదు) ఎల్లప్పుడూ ఉత్సాహంగా, సంతోషంగా ఉండాలి. 
క్షమయా తు రామః ఓర్పులో రామునిలాగా ఉండాలి. పితృవాక్యపరిపాలకుడైన రాముని వలె క్షమించేగుణాన్ని కలిగిఉండాలి.
భోజ్యేషు తృప్తః భార్య/తల్లి వండినదాన్ని సంతృప్తిగా (వంకలు పెట్టకుండా) భుజించాలి. 
సుఖదుఃఖ మిత్రం  సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వాలే  అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి.
ఈ షట్కర్మలు - ఈ ఆరు పనులు సక్రమంగా చేసే  పురుషుడు ఉత్తమ  పురుషునిగా , ధర్మనాథునిగా కొనియాడబడతారు.


నారీ వీర విజయ శంఖారావం :
మధురం మంత్రముగ్దమైన మగువ ప్రాయాన వూగేను కలల ఊయల 
స్వేచ్చ్చా విహంగమై భావావేశాల మబ్బుల జతలో తేలియాడుతున్నది  నేటి మహిళ 
ఊహలలో నటనమాడు పడతికి సమాజం  వేస్తున్నది  పసుపుతాడు ముచ్చట సంకెల
ఇల్లాలిగా ,మాతృమూర్తిగా బాధ్యతలను పంచుకొని మమతానురాగాల నింపుకొని 
దశావతారం ఎత్తి ,అన్నీ తానై  అన్నింటా తానై అభినయిస్తున్నది నేటి  స్త్రీ భారతం .
సృష్టికి మూలమైన  జీవన బీజాన్ని కడుపున పెంచి మొలకగా వెలికి తీసి 
తరువుగా పెంచే శాస్త్రజ్ఞురాలు ,ప్రాజ్ఞురాలు ,అనుభవజ్ఞురాలు నేటి మహిళ 
ఆమె విజ్ఞాన ఖని ... సుగుణాల గని ... సుందర సురుచిర సుకుమార మణి 
సామాజిక సాంకేతిక మాధ్యమాల్లో ఎగురుతున్నాయి మహిళా విజయ కేతనాలు 
వైజ్ఞానికంగా ఎంత ఎదిగినా తప్పలేదు కదా స్త్రీకి రాబందుల సైబరు కర్కశ దాడులు   
ఎన్ని ఘన శిఖరాలధిరోహించినా మురిపించలేదు కదా ముందు తరాల మూర్ఖ వాదనలు
గృహ హింసలు,వరకట్న కాష్టాలు ,నిర్బంధ శ్రమబాధలు 
తప్పలేదు స్త్రీ జాతికి... తప్పలేదు మూల సృష్టికి 
షట్కర్మయుక్త కుల సతికి తప్పలేదు రక్కస పతుల కర్కశ కోరల పలుపోట్లు  పంటిగాట్లు
ప్రగతి బాటపై నడిచే మువ్వలు , విజయపథముకై రవళించే కరకంకణాలు, నినదించే కోకిల స్వరాలు
అక్షరమే ఆయుధమై ,పలురంగాలలొ ఏలికయై ,పాలికయై రిపుజన భంజని కాళికయై    
లీలా కృష్ణుని ప్రియ వధూటి భామయై.. ఒక కంట హరి జూచి ఒక కంట ఆరి జూచి 
కైదండ శంఖము తొ ..  నారీ భేరి మ్రోగించి సురనరీ ఝరులుగా ఉధృతి లంఘించి 
ఝాన్సిగా ,రుద్రమగా ,మగువ మాంచాలగా ,చైతన్య కళా భారతిగా 
కదలాలీ స్త్రీ  జన సందోహం..  .సాధించాలీ ఘన విజయం..  ధరించాలి  కీర్తి మకుటం 
సాగాలీ నారీ ప్రభంజనం .ఇంటింటా ,అన్నింటా.... పలురంగముల...  పలు రూపముల 
దివి భువి ఏకమౌనటుల .. దిక్కులొక్కటిగ పిక్కటిల్లునటుల 
రావాలీ అతివకు అర్థ సింహాసనం ... అన్నింటా వెలగాలి అర్థ నారీశ్వరం. 

Related Posts