రాష్ట్రానికి తొలి ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ)గా ఆర్‌పీ సిసోడియా నియమితులయ్యారు. గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న సిసోడియాను సీఈఓగా నియమిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను జారీచేసింది. ఆయన సోమవారం పదవీ బాధ్యతలను స్వీకరించనున్నారు. రాష్ట్ర విభజన అనంతరం రెండు తెలుగు రాష్ట్రాలకు సీఈఓగా భన్వర్‌లాల్ వ్యవహరించి పదవీ విరమణ చేశారు. సీఈఓ నియామకం కోసం సీనియర్ ఐఏఎస్‌లు అనంతరాములు, నీరబ్ కుమార్ ప్రసాద్, సిసోడియా పేర్లను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించింది. తనను సీఈఓగా నియమించడంపై సిసోడియా మాట్లాడుతూ...సంతోషంగా, సవాలుగా ఉందని వ్యాఖ్యానించారు.