YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

ఇన్నాళ్లకు నిజాన్ని ఒప్పుకున్న పాకిస్తాన్

ఇన్నాళ్లకు నిజాన్ని ఒప్పుకున్న పాకిస్తాన్

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో: 

ప్రపంచ ఉగ్రవాదానికి పుట్టిల్లుగా అభివర్ణించే దేశాల్లో దాయాది పాకిస్తాన్ ఒకటి. అయితే.. ఆ దేశం మాత్రం తమ దేశంలో ఉగ్రమూలాలే లేవన్నట్లుగా మాట్లాడుతూ ఉంటుంది. గత ప్రభుత్వాలకు భిన్నంగా.. తన ప్రధానుల తీరుకు విరుద్ధంగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తొలిసారి నిజాల్ని మాట్లాడారు. పాకిస్తాన్ ఉగ్ర రహస్యాన్ని ఆయన అమెరికాలో వెల్లడించారు. ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆశ్రయం ఇస్తుందన్న ఆరోపణలు నిజమని తేలిపోయేలా తాజాగా ఇమ్రాన్ మాటలుండటం గమనార్హం. 2014లో పాకిస్థానీ తాలిబన్లు పెషావర్ లోని సైనిక పాఠశాలలో 150 మంది చిన్నారుల్ని ఘోరంగా హతమార్చారని.. దీంతో దేశంలో మరే తీవ్రవాద సంస్థను అనుమతించకూడదన్న ప్లాన్ కు అన్ని రాజకీయ పార్టీలు సమ్మతించాయని.. మిలిటెంట్ సంస్థల్ని కట్టుదిట్టం చేస్తూ.. వారి చేతికి ఆయుధాలు చిక్కకుండా చేస్తున్న తొలి ప్రభుత్వం తమదేనని ఇమ్రాన్ చెప్పుకున్నారు.
తమ దేశంలో 30 వేల నుంచి 40 వేల వరకు ఉగ్రవాదులు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. వారంతా శిక్షణ పొందిన సాయుధ ఉగ్రవాదులని.. వీరంతా కశ్మీర్.. అఫ్గానిస్థాన్ లలో పని చేసిన వారేనని వెల్లడించారు. తమ భూభాగంలో మిలిటెంట్ సంస్థలు పని చేస్తున్న విషయాన్ని గత ప్రభుత్వాలు అమెరికాకు చెప్పకుండా నిజాన్ని తొక్కి పెట్టినట్లుగా ఆయన చెప్పారు.గడిచిన కొన్నేళ్లుగా పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం ఇస్తున్నట్లుగా భారత్.. ఆఫ్గానిస్థాన్ ప్రభుత్వాలు చేస్తున్న ఆరోపణలు ఇమ్రాన్ తాజా ప్రకటనతో నిజమని తేలినట్లుగా చెప్పాలి. అమెరికాలో తన పర్యటన సందర్భంగా ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Related Posts