యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
బుధవారం అర్ధరాత్రి దాటాక భూమి పన్నెండు నిమిషాల వ్యవధిలో నాలుగుసార్లు కంపించడంతో ముంబాయి జనం హడలిపోయారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా దహను కేంద్రంగా భూకంపం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే...నిన్న అర్ధరాత్రి ఒంటి గంటా మూడు నిమిషాలకు తొలిసారి భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 3.6గా నమోదయింది. ఆ తర్వాత 1.15 గంటల మధ్య మరో మూడుసార్లు భూ ప్రకంపనలతో ఆ ప్రాంతం వణికింది. తీవ్రత రిక్టర్ స్కేల్‌పై వరుసగా 3.6, 2.9, 2.8గా నమోదయింది. భూకంపం తీవ్రతకు ఓ ఇంటి గోడ కూలిపోవడంతో దాని కింద చిక్కుకుని 55 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఓ వైపు భూ ప్రకంపనలు వణికిస్తున్నా, నిన్న రాత్రి నుంచి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు జనం బయటకు రాలేక పోయారు. రాత్రంతా బిక్కుబిక్కుమంటూ ఇళ్లలోనే గడిపారు.