YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

కల్నల్ ధోని

కల్నల్ ధోని

యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:

సైన్యానికి సేవ చేయడం కోసం రెండు నెలలపాటు క్రికెట్‌కు దూరమైన ధోనీ.. విండీస్ పర్యటనకు తనను పరిగణనలోకి తీసుకోవద్దని సెలెక్టర్లను కోరిన సంగతి తెలిసిందే. ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న ధోనీ.. త్వరలోనే సైన్యం దుస్తుల్లో కశ్మీర్ లోయలో పెట్రోలింగ్ విధులు నిర్వర్తించనున్నాడు. ‘‘జూలై 31 నుంచి ఆగష్టు 15 వరకు 106 టెరిటోరియల్ ఆర్మీ బెటాలియన్‌లో ధోనీ పని చేయనున్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ పెట్రోలింగ్, గార్డ్, పోస్ట్ డ్యూటీల్లో పాల్గొనడంతోపాటు భద్రతా దళాలతోనే సమయం గడుపుతాడు’’ అని న్యూస్ ఏజెన్సీ ఏన్ఎఐ ట్వీట్ చేసింది. 2011లో ధోనీ నాయకత్వంలోని టీమిండియా వరల్డ్ కప్ గెలిచింది. అదే ఏడాది ఆర్మీ మహీకి గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాను కట్టబెట్టింది. నాలుగేళ్ల క్రితం ధోనీ పారాట్రూపర్‌గా అర్హత సాధించాడు. ఇందుకోసం ఆగ్రా ట్రైనింగ్ క్యాంప్‌లో ఇండియన్ ఆర్మీ ఎయిర్‌క్రాఫ్ట్‌ల ద్వారా ఐదు పారాచూట్ ట్రైనింగ్ జంప్‌లను పూర్తి చేసుకున్నాడు. వరల్డ్ కప్‌లో భాగంగా సౌతాఫ్రికాతో టీమిండియా ఆడిన తొలి మ్యాచ్‌లో ధోనీ బలిదాన్ గ్లౌవ్స్‌తో వికెట్ కీపింగ్ చేశాడు. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధమని ఐసీసీ సూచించండంతో.. తర్వాతి మ్యాచ్‌ల నుంచి సాధారణ గ్లౌవ్స్‌తోనే వికెట్ కీపింగ్‌ చేశాడు.

Related Posts