YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

హిందూ మహిళల హక్కుల పరిరక్షణకు బిల్లు: కాంగ్రెస్ డిమాండ్

హిందూ మహిళల హక్కుల పరిరక్షణకు బిల్లు: కాంగ్రెస్ డిమాండ్

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

కేంద్ర ప్రభుత్వం గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లు 2019ను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ పార్టీ ఎంపీ జావేద్ మాట్లాడుతూ ఈ బిల్లు వల్ల భారతీయ ముస్లిం మహిళలు మరింత దయనీయ పరిస్థితులను ఎదుర్కొనవలసి వస్తుందన్నారు. విడాకులు పొందిన హిందూ మహిళల హక్కుల పరిరక్షణకు కూడా ఓ బిల్లును తీసుకురావాలని డిమాండ్ చేశారు.బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి మాట్లాడుతూ ఈ బిల్లుకు మద్దతు తెలిపారు. ప్రతిపక్షాలు ఈ బిల్లును వ్యతిరేకిస్తుండటాన్ని తప్పుబట్టారు. తక్షణ ట్రిపుల్ తలాక్ వల్ల చాలా మంది ముస్లిం మహిళల జీవితాలు నాశనమయ్యాయన్నారు.

Related Posts