YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

మరో వివాదంలో ధోని

మరో వివాదంలో ధోని

యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:

మహేంద్ర సింగ్ ధోనీ.. టీమిండియా ఫేమస్ క్రికెటర్. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న మేటి ఆటగాడు. ఈయన పేరు ఇటీవల ఏదో ఒకరకంగా వార్తల్లో ఉంటూనే వస్తోంది. ఇప్పుడు తాజాగా రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ఆమ్రపాలి గ్రూప్‌ కారణంగా మళ్లీ ధోనీ పేరు సంచలనం అవుతోంది. దేశీ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఇప్పటికే ఆమ్రపాలి గ్రూప్‌నకు రెరా రిజిస్ట్రేషన్‌ చేసింది. అయితే ఇప్పుడు కథ ధోనీ, ఆయన భార్య సాక్షి మీదకు మళ్లింది. ఇంటి కొనుగోలుదారుల డబ్బును ఆమ్రపాలి అక్రమ పద్ధతుల్లో దానిమళ్లించిదన్న ఆరోపణలు సర్వత్రా వెలువడుతున్నాయి. అయితే ఇందులో ధోనీకి సంబంధమున్న వార్తలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. దీనికంతటికీ కారణం రితి స్పోర్ట్స్ అనే సంస్థ. ఇదొక స్పోర్ట్స్ మార్కెటింగ్ అండ్ మేనేజ్‌మెంట్ కంపెనీ. దీన్ని ధోనీ స్నేహితుడు అరుణ్ పాండే నడిపిస్తున్నారు. అలాగే కంపెనీలో ధోనీకి కూడా వాటా ఉంది. ధోనీ సహా పలు క్రికెటర్ల ఎండోర్స్‌మెంట్ కాంట్రాక్టులను ఇదే చూసుకుంటుంది. మరోవైపు ఆమ్రపాలి గ్రూప్‌‌కు చెందిన అనుబంధ సంస్థ ఆమ్రపాలి మహి డెవలపర్స్‌లో సాక్షి డైరెక్టర్‌గా ఉన్నారు. అలాగే ఈమెకు ఇందులో 25 శాతం వాటా ఉంది. ఆమ్రపాలి గ్రూప్‌నకు ధోనీ 2009 నుంచి 2015 వరకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. ఇంటి కొనుగోలుదారులు సోషల్ మీడియాలో ధోనీని ట్రోల్ చేయడంతో ఆయన 2016లో కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌ ఒప్పందం నుంచి తప్పుకున్నారు. ఆమ్రపాలి గ్రూప్‌ గృహ కొనుగోలుదారులకు చెందిన డబ్బును చట్టవ్యతిరేక పద్ధతుల్లో దారి మళ్లించడం కోసం రితి స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌‌, ఆమ్రపాలి మహి డెవలపర్స్‌తో చీకటి ఒప్పందాలు కుదుర్చుకుందని కోర్టుకు సమర్పించిన ఫోరెన్సిక్‌ నివేదికలో వెల్లడైంది. దీని ప్రకారం.. ఆమ్రపాలి గ్రూప్ కంపెనీలు 2009-2015 మధ్యకాలంలో రితి స్పోర్ట్స్‌కు ఏకంగా రూ.42.22 కోట్లు దారి మళ్లించింది. న్యాయమూర్తులు అరుణ్‌ మిశ్రా, యూయూ లలిత్‌లు వెలువరచిన 270 పేజీల తీర్పులో ఈ విషయాలు ఉన్నట్లు ఫోరెన్సిక్‌ ఆడిటర్లు తెలిపారు. ఈ కంపెనీల నుంచి ఇంటి కొనుగోలుదారుల డబ్బును తిరిగి రికవరీ చేయాల్సి ఉందని పేర్కొన్నారు. మరోవైపు ఈ వార్తలపై రితి స్పోర్ట్స్‌ స్పందించింది. ఆమ్రపాలి సంస్థతో జరిగిన లావాదేవాలన్నీ విశ్వసనీయమైనవేనని స్పష్టం చేసింది. తమ సంస్థ ఎండోర్స్‌మెంట్లన్నీ కమిషన్ బేసిస్ మీద సాగుతాయని.. ప్రతి లావాదేవీకి సంబంధించిన పత్రాలు తమ వద్ద భద్రంగా ఉన్నాయని చెప్పింది.

Related Posts