YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఇక ఒక్కో పార్టీ వైదొలగుతాయి

Highlights

  • ఈ పరిణామాన్ని ముందే ఊహించాం
  • భాగస్వామ్య పార్టీలను
  • ఎలా చూసుకోవాలో బీజేపీకి తెలియదు
  • శివసేన నేత సంజయ్ రౌత్
ఇక ఒక్కో పార్టీ వైదొలగుతాయి

భాగస్వామ్య పక్షాలను ఎలా చూసుకోవాలో భారతీయ జనతా పార్టీకి మరో భాగస్వామి శివసేన సీనియర్ నేత, ఉద్ధవ్ థాకరే ప్రధాన అనుచరుల్లో ఒకరైన సంజయ్ రౌత్ అన్నారు. తెలుగుదేశం కేంద్ర ప్రభుత్వం నుంచి తన మంత్రులను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో అయన మాట్లాడారు.ఈ పరిణామాన్ని ముందుగానే గమనించాం. ఎన్డీయే నుంచి ఇరత పార్టీలు కూడా బయటకు రానున్నాయని చెప్పారు. భాగస్వామ్య పక్షాలతో ఎలా కలిసి మెలసి ఉండాలో ప్రధాని నరేంద్ర మోదీకి, బీజేపీకి తెలియడం లేదని, కూటమి నుంచి ఒక్కో పార్టీ వైదొలగుతూ ఉంటే మోదీకి గడ్డుకాలమేనని హెచ్చరించారు. ఈ పరిణామాన్ని ముందుగానే గమనించాం. ఎన్డీయే నుంచి ఇరత పార్టీలు కూడా బయటకు రానున్నాయి.


శివసేన ఎంపీ అరవింద్ సావంత్ సైతం ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మిత్ర పక్షాలను గౌరవించడం బీజేపీ పెద్దలకు తెలియడం లేదని, ఈ విషయం తెలుగుదేశం పార్టీ అందరికన్నా ముందుగానే గ్రహించిందని అన్నారు. 'అందరితో కలసి' (సబ్ కా సాథ్) అని చెప్పే బీజేపీ, ఆ పని ఏమాత్రమూ చేయకుండా విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటూ వెళుతోందని, తెలుగుదేశం నిర్ణయంతో బీజేపీ నిజస్వరూపం మరోసారి బయటకు వచ్చిందని విమర్శించారు.

Related Posts