YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీ బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం.. 

Highlights

  • బీజేపీ మంత్రులు గైర్హాజరు
  • బడ్జెట్ మొత్తం రూ.1,96,800కోట్లు 
ఏపీ బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం.. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి యనమా రామకృష్ణుడు 2018- 19 సంవత్సరానికి రూపొందించిన బడ్జెట్ కేటాయింపులకు రాష్ట్ర మంత్రి  మండలి ఆమోదం లభించింది. ఇక అసెంబ్లీ ఆమోదం లాంఛనప్రాయమే. బడ్జెట్ సందర్భంగా జరిగిన కేబినెట్ సమావేశానికి బీజేపీ మంత్రులు ముఖంచాటేసారు. అత్యంత కీలకమైన ఈ బడ్జెట్ కు మంత్రివర్గంలో భాగస్వామ్యమైన  బీజేపీ మంత్రులు కామినేని, మాణిక్యాలరావు గైర్హాజరయ్యారు. గురువారం ఉదయం 11.30గంటలకు ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. దానికి ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ము సమావేశం జరిగింది.  ఈ  సమావేశానికి దూరంగా ఉన్న బీజేపీ మంత్రులు అసెంబ్లీలో రాజీనామాలు ప్రకటించారు. భాజాపా అధిష్టానం ఆదేశించిన నేపథ్యంలో మంత్రి కామినేని, మాణిక్యాలరావులు  సీఎం చంద్రబాబుకు తమ రాజీనామా లేఖలను సమర్పించారు. అంతకు ముందే వారు తమకు ప్రభుత్వం సమకూర్చిన అధికారిక వాహనాలను, ఐడీ కార్డులను తిరిఫై స్వాధీనం చేశారు.  ఈ పరిణామాల నేపథ్యంలో యనమల ప్రవేశపెట్టిన బడ్జెట్ మొత్తం రూ.1,96,800కోట్లు కాగా  రెవెన్యూ వ్యయం రూ.1,63,660 కోట్లు. ఇక  కేపిటల్ వ్యయం కింద రూ.33,160 కోట్లు ప్రతిపాదించారు. 14వ ఆర్థిక సంఘం అంచనా మేరకు ఏపీ రాష్ట్ర స్థూల ఉత్పత్తిని రూ.8,70,330 కోట్లుగా పేర్కొన్నారు. రూ,30,000కోట్లు అప్పు చేయనున్నారు. ఇక సొంత పన్నుల ద్వారా రూ.70 వేల కోట్ల ఆదాయం వస్తుందని ప్రతిపాదించారు. 

Related Posts