YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఎన్నారై భర్తలు జాగ్రత్త!..రంగం లోకి దిగుతున్న కేంద్రప్రభుత్వం

ఎన్నారై భర్తలు జాగ్రత్త!..రంగం లోకి దిగుతున్న కేంద్రప్రభుత్వం

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

పెళ్లి చేసుకుని పరాయి దేశానికి తీసుకెళ్లి భార్యలను వేధించే ఎన్నారై భర్తలు భార్యలను వదిలేసే ఎన్నారై భర్తల ఆగడాలకు కేంద్రం చెక్ పెట్టడానికి కేంద్రం రెడీ అవుతోంది.  ఈ విషయం ఏకంగా ప్రధాని మోదీయే దృష్టి పెట్టడంతో త్వరలో ఇలాంటివారి పని పట్టేలా చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది. ఇటీవలి కాలంలో ఎన్నారై భర్తలు వదిలేసే భారతీయ భార్యల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఈ విషయాన్ని పార్లమెంటు సాక్షిగా విదేశాంగ శాఖ మంత్రి కూడా వెల్లడించారు. ఇలా ఎన్నారై భర్తలు తమను వదిలేశారంటూ ఎంతోమంది మహిళలు ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈ ఫిర్యాదులు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అధికంగా వస్తున్నాయని - ఈ పరిస్థితిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.పంజాబ్ వుమెన్ కమిషన్ చైర్ పర్సన్ మనీషా గులాటి గురువారం... ఎన్నారై భర్తలు వదిలేసిన ఎంతో మంది భార్యలు న్యాయం కోసం తమ కార్యాలయం తలుపులు తట్టారని  చెప్పారు. ఈ పరిస్థితిని వివరించేందుకు తాను ప్రధాని మోదీని కలిసినట్లు ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా సమస్యను తెలుసుకున్న మోదీ.. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి తీసుకోవలసిన చర్యలన్నీ తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు మనీషా తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటికే తమకు ఇటువంటి ఫిర్యాదులు వచ్చాయని మోదీ చెప్పారని సమాచారం.కాగా కేంద్రం ఇప్పటికే ఇలాంటివారిపై చర్యలు తీసుకున్న సందర్భాలున్నాయి. గత ఏడాది - అంతకుముందు సంవత్సరం ఇలాంటి ఎన్నారై భర్తల పాస్ పోర్టులను కేంద్రం రద్దు చేసింది. పాస్పోర్టు రద్దు సమయంలో సదరు భర్త భారత్ లో ఉంటే కేసు తేలేవరకూ విదేశాలకు వెళ్లడం సాధ్యంకాకుండా చేయాలని.. ఒక వేళ విదేశాల్లో ఉంటే తక్షణమే భారత్ వచ్చేలా నిబంధనలు రూపొందిస్తున్నట్లు సమాచారం.

Related Posts