ఒక సినిమాకు ఇంత భారీ మొత్తాన్ని ఇస్తామని ఆఫర్ ఇస్తే, ఆమె బాగా ఆలోచించుకునే 'నో' చెప్పిందట. తమిళంలో కొత్త హీరో శరవణన్ ను పరిచయం చేస్తూ, అతని పక్కన హీరోయిన్ గా నయనతార అయితే బాగుంటుందని భావించిన నిర్మాతలు ఆమెను సంప్రదించారట. లేడీ సూపర్ స్టార్ ట్యాగ్ తో, లేడీ ఓరియంటెడ్ చిత్రాలపై కన్నేసిన ఆమె, కొత్త హీరో అనేసరికి వద్దని చెప్పేసిందట. అయినా వదలని నిర్మాతలు పది కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తామని నచ్చజెప్పినా అంగీకరించలేదట. కొత్త నటుడు కావడంతోనే నయన్ అంగీకరించలేదని కొంతమంది. పాత్ర నచ్చలేదని మరికొందరు చెబుతున్నారు