Highlights
- హెల్మెట్ తెచ్చిన తిప్పలు
ట్రాఫిక్ నిబంధలను పాటించి వారి పట్ల పోలీసులు ప్రదర్శించే అత్యుత్సాహాం ఓ గర్భిణీ స్త్రీ అకాలమరణానికి దారితీసింది. ఈ దుర్ఘటన తమిళనాడులోని తిరుచి జిల్లాలో చోటుచేసుకుంది. హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్నఓ బైకిస్టును పట్టుకునేందుకు ఓ పోలీసు అధికారి చేసిన ప్రయత్నంలో ఈ ఘటన జరిగింది. గర్భిణి అయిన తన భార్యతో కలిసి బైక్‌పై తిరుచి వెళ్లేప్రయత్నంలో ఉన్న తంజావూరుకు చెందిన రాజాను తిరువెరుంబర్ చెక్‌పాయింట్ వద్ద పోలీసులు ఆపబోయారు. దాంతో రాజా హెల్మెట్ లేదన్న భయంతో ఆపకుండా వెళ్లిపోయాడు. దీంతో కామరాజ్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ కామరాజ్ వెంటపడడంతో రాజా బైక్ వేగం పెంచాడు.దాంతో బ్యాలెన్స్ కోల్పోయి రాజా, అతడి భార్య బండి మీద నుంచి పడ్డారు. బైక్ పైనుంచి పడిన తర్వాత ఆమెపై నుంచి మరో వాహనం వెళ్లడంతో ఆమె ప్రాణాలు కోల్పోయిందని కొందరు చెబుతున్నారు. ట్రాఫిక్ పోలీసు బైక్‌ను తన్నడం వల్లే వారు కిందపడిపోయారని మరికొందరు పేర్కొంటున్నారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.