YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఎస్‌బీఐ కస్టమర్లకు వినూత్నమైన సేవలు

ఎస్‌బీఐ  కస్టమర్లకు వినూత్నమైన సేవలు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

దేశీ దిగ్గజ ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్లకు వినూత్నమైన సేవలు అందిస్తోంది. అయితే ఈ సర్వీసులు అందరికీ అందుబాటులో ఉండవు. కేవలం ఎంపిక చేసిన ఖాతాదారులకు మాత్రమే లభిస్తాయి. అర్హత కలిగిన కస్టమర్లు ఎస్‌బీఐ వెల్త్ కింద ఈ సేవలు పొందొచ్చు. ఎస్‌బీఐ వెల్త్ కింద బ్యాంక్ ఖాతాదారులు కస్టమైజ్‌డ్ ప్రీమియం బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు. బ్యాంక్ వీరి కోసం కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజర్‌ను నియమిస్తుంది. ఈయన ద్వారా ఖాతాదారులు రోడ్‌స్టెప్ బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు. ఎస్‌బీఐ వెల్త్ అకౌంట్ హోల్డర్లకు బ్యాంక్ సిగ్నేచర్ డెబిట్, క్రెడిట్ కార్డులను జారీ చేస్తుంది. వీటి సాయంతో లైఫ్‌స్టైల్ బెనిఫిట్స్, ఎక్కువ రివార్డు పాయింట్లను పొందొచ్చు. అలాగో త్వరితగతిన రుణ ఆమోదం, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ రేటు, ఆకర్షణీయ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్ వంటి ప్రయోజనాలు పొందొచ్చు.
ఎస్‌బీఐ వెల్త్ సేవలు ప్రస్తుత కస్టమర్ లేదా కొత్త ఖాతాదారుడు ఎవరైనా పొందొచ్చు. అయితే ఇందుకు కొన్ని అర్హతులు కలిగి ఉండాలి. ప్రస్తుత బ్యాంక్ కస్టమర్ అయితే.. టోటల్ రిలేషన్‌షిప్ వ్యాల్యు (టీఆర్‌వీ) రూ.30 లక్షలు ఉండాలి. మొత్తం డిపాజిట్లు, ఇన్వెస్ట్‌మెంట్లు, డీమ్యాట్ అకౌంట్ హోల్డింగ్స్ వంటివి కలుపుకొని టీఆర్‌వీ వస్తుంది. నెల నెట్ వేతనం రూ.2 లక్షలు లేదా ఆపైన ఉండాలి. ఎస్‌బీఐ హోమ్ లోన్ రూ.కోటికిపై తీసుకొని ఉండాలి. అదే బ్యాంక్ కొత్త ఖాతాదారుడు అయితే ప్రారంభ డిపాజిట్/ఇన్వెస్ట్‌మెంట్ విలువ రూ.10 లక్షలు ఉండాలి. తర్వాత ఈ విలువ 12 నెలల్లో రూ.30 లక్షలకు పెంచుకోవాల్సి ఉంటుంది. నెల నెట్ శాలరీ రూ.2 లక్షలు, ఆపైన ఉండాలి. ఇక రూ.కోటి లేదా ఆపైన హోమ్ లోన్ తీసుకొని ఉండాలి. బ్యాంక్ ఇలాంటి కస్టమర్ల కోసం ప్రత్యేకంగా ఇ-వెల్త్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసింది. ఇక్కడ బ్యాంకింగ్ సమయం అయిపోయిన తర్వాత కూడా బ్యాంక్ సేవలు పొందొచ్చు. ఫోన్ కాల్ లేదా వీడియో కాలింగ్ ద్వారా రిలేషన్‌షిప్ మెనేజర్ సాయంతో ఈ సేవలు పొందొచ్చు. అలాగే బ్యాంక్ వీరి కోసం కొత్త యాప్‌ను కూడా తీసుకురానుంది.

Related Posts