YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

దేశంలో మూడు వేల పులులు

 దేశంలో మూడు వేల పులులు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

దేశంలో పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. సోమవారం అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా.. ప్రధాని మోదీ దేశంలోని పులుల గణాంకాలను విడుదల చేశారు. ‘స్టేటస్ ఆఫ్ టైగర్స్ ఇన్ ఇండియా-2018’ పేరుతో ఢిల్లీలో ఈ నివేదికను విడుదల చేశారు. దేశ వ్యాప్తంగా ప్రసుత్తం 2,697 పులులు ఉన్నట్లు ప్రధాని వెల్లడించారు. పులుల సంరక్షణకు ప్రపంచంలోనే అత్యంత ఆవాసయోగ్యమైన దేశంగా భారత్ ఉందని పేర్కొన్నారు. 2022 నాటికి పులుల సంఖ్య రెట్టింపు చేయాలని 2010లో సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో నిర్దేశించిన లక్ష్యాన్ని భారత్ నాలుగేళ్ల ముందుగానే సాధించిందని మోదీ తెలిపారు. పులుల సంరక్షణ కోసం బీజేపీ ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ‘మనదేశంలో పులుల సంఖ్య సుమారు 3 వేలకు చేరుకోవడం శుభపరిణామం. గత నాలుగేళ్లలో భారత్‌లో దాదాపు 700 పులులు పెరిగాయి. పులుల సంరక్షణ కేంద్రాల సంఖ్య 692 నుంచి 860కి చేరుకుంది. కమ్యూనిటీ రిజర్వ్‌లు 43 నుంచి 100కి పైగా పెరిగాయి’ అని మోదీ తెలిపారు. ప్రధాని విడుదల చేసిన నివేదిక ప్రకారం పులుల సంఖ్య అధికంగా ఉన్న రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం 526 పులులు ఉన్నాయి. 524 పులులతో కర్ణాటక రెండో స్థానంలో, 442 పులులతో ఉత్తరాఖండ్ మూడో స్థానంలో ఉన్నాయి. తమిళనాడులో 264, కేరళలో 190 పులులు ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. ఆలిండియా టైగర్ ఎస్టిమేషన్ పేరుతో 2006 నుంచి ప్రతి నాలుగేళ్లకోసారి పులుల సంఖ్యపై ప్రభుత్వం నివేదిక విడుదల చేస్తోంది. గతంలో 2010, 2014లో కూడా నివేదిక విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా పులుల సంఖ్యను పెంచాలనే ఉద్ధేశంతో ఏటా జులై 29న అంతర్జాతీయ పులుల దినోత్సవం నిర్వహించాలని 2010లో సెయింట్ పీటర్స్‌బర్గ్ టైగర్ సమ్మిట్‌లో తీర్మానించారు.

Related Posts