YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రాజ్యసభలో వెంకయ్య కన్నీరు

రాజ్యసభలో వెంకయ్య కన్నీరు

కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి మరణంపై సోమవారం రాజ్యసభ సంతాపం తెలిపింది. సభ ప్రారంభంకాగానే.. రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సభ్యులంతా మౌనం పాటించి.. జైపాల్‌రెడ్డి మృతికి సంతాపాన్ని తెలియజేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని తలచుకొని వెంకయ్య భావోద్వేగానికి గురయ్యారు.. సభలో కన్నీరు పెట్టుకొన్నారు. జైపాల్‌రెడ్డితో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని వెంకయ్య గుర్తు చేశారు. తామిద్దరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కలిసి పనిచేశామని.. బెంచ్‌ మేట్స్‌గా ఉండేవాళ్లమన్నారు. ఆయన తనకు సీనియర్.. ఆరేళ్ల పెద్దవాడని.. అయినా మంచి మిత్రుడిగా తనకు మార్గదర్శకం చేసేవారన్నారు. ప్రజాసమస్యలపై గళం వినిపించేవారిమి అన్నారు. అలా జైపాల్‌తో గడిపిన పాత రోజుల్ని గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం కలిచివేసిందంటూ భావోద్వేగానికి గురయ్యారు. వెంకయ్య ఆదివారం జైపాల్‌రెడ్డి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపి పరామర్శించారు. సోమవారం నుంచి రాజ్యసభ సెషన్స్ ఉండటంతో ఆయన హైదరాబాద్ నుంచి తిరిగి ఢిల్లీ వెళ్లారు. ఆనవాయితీ ప్రకారం పార్లమెంట్ మాజీ సభ్యులు ఎవరైనా చనిపోతే.. సభలో సంతాపం ప్రకటిస్తారు. ఈ మేరకు రాజ్యసభలో జైపాల్‌రెడ్డి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

Related Posts