యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:
విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన 'డియర్ కామ్రేడ్' చిత్రం బాక్సాఫీసు వద్ద విజయం సాధించి దూసుకుపోతోంది. కాగా, ఈ చిత్రాన్ని హిందీలోకి రీమేక్ చేయడానికి ఇప్పటికే ప్రముఖ బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జొహార్ హక్కులను తీసుకున్నాడు. ఇందుకు గాను ఆయన 6.2 కోట్లు చెల్లించినట్టు తెలుస్తోంది. ఇంతకు ముందు కూడా కరణ్ జోహార్ 'జెర్సీ' రీమేక్ హక్కులు తీసుకున్న సంగతి తెలిసిందే