YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

'మహిళా' రైల్వే స్టేషన్‌గా బేగంపేట స్టేషన్

Highlights

  •  27 మంది మహిళా ఉద్యోగుల విధులు
  • త్వరలో  ఫిరంగిపురం, రామవరప్పాడు
  • మహిళా రైల్వే స్టేషన్‌గా మారతాయి
  • దక్షిణ మధ్య రైల్వే జీఎం వీకే యాదవ్ సందర్శం 
'మహిళా' రైల్వే స్టేషన్‌గా బేగంపేట స్టేషన్

దక్షిణమధ్య రైల్యేస్ సికింద్రాబాద్ డివిజన్ కు చెందిన  హైదరాబాద్ లోని  బేగంపేట రైల్యే స్టేషన్ ను మహిళా స్టేషన్ గా మార్చారు.దేశంలోనే మొట్టమొదటి మహిళా రైల్వేస్టేషన్‌గా ముంబయిలోని మాతుంగ సబర్బన్‌ స్టేషన్‌ వినుతికెక్కింది. బేగంపేట రైల్యే స్టేషన్ లో 27  మహిళా సిబ్బందిని నియమించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం టేస్టుకున్నట్టు దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్ కుమార్ యాదవ్  తెలిపారు. గురువారం  బేగంపేట రైల్వేస్టేషన్‌ను సందర్శించిన ఆయన మహిళా రైల్వే స్టేషన్‌గా ప్రకటించారు. దీనితో పాటు ఫలక్‌నుమా-సీతాఫల్‌మండి సెక్షన్‌లోని విద్యానగర్‌ ఎంఎంటీఎస్‌ స్టేషన్‌ ను కూడా మహిళా స్టేషన్ గా మార్చనున్నారు. ఫలితంగా    నలుగురు కమర్షియల్‌ బుకింగ్‌ క్లర్క్‌లు, ముగ్గురు టిక్కెట్‌ రిజర్వేషన్‌ కేంద్రం సిబ్బంది, ముగ్గురు రైల్వే పరిరక్షక దళం (ఆర్పీఎఫ్‌) సిబ్బంది, ఐదుగురు సఫాయి కార్మికులుగా ఇక మహిళలే ఉంటారు.అలాగే, గుంటూరు డివిజన్‌లోని ఫిరంగిపురం రైల్వే స్టేషన్‌తో పాటు విజయవాడ డివిజన్‌లోని రామవరప్పాడు రైల్వే స్టేషన్‌ను కూడా కొన్ని రోజుల్లో మహిళా రైల్వే స్టేషన్లుగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. బేగంపేట రైల్వే స్టేషన్‌లో 27 మంది మహిళా ఉద్యోగులను నియమించామని, టికెట్ల జారీ నుంచి తనిఖీలు, భద్రత, పారిశుద్ధ్యం వరకు మహిళా ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తారని చెప్పారు. రైల్వేల్లో రాణిస్తోన్న మహిళలను ఆయన అభినందించారు.

Related Posts