YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

రిటర్న్స్ సరిగా లేకుంటే తిప్పలే!

Highlights

  • లెక్కలు చెప్పని వాళ్ళు 10,238 మంది 
  • హైదరాబాద్ లో  448 మంది 
  • విజయవాడలో 153 మంది
  • విశాఖపట్నంలో 80 మంది
  • 681 మందిపై ఐటీ నిఘా 
రిటర్న్స్ సరిగా లేకుంటే తిప్పలే!

ఇకనుంచి ఆదాయానికి సంబంధించి సరైన లెక్కలు చెప్పకపోతే తిప్పలు తప్పవు. దేశ వ్యాప్తంగా ఆదాయ పన్ను శాఖకు రిటర్న్స్ ఫైల్ చేయని వ్యక్తులు, సంస్థలు, భాగస్వామ్య సంస్థలు 10,238 వరకు ఉన్నాయని లెక్కలు తేల్చారు. ఈ నగదు డిపాజిట్లకు సంబంధించి సరైన సమాచారంతో ఈ నెలాఖరులోగా రిటర్న్స్ దాఖలు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని ఏపీ, తెలంగాణ ఆదాయపన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ హెచ్చరించారు. ఎందుకంటే పెద్దనోట్ల రద్దు తరువాత ఇలా తమ బ్యాంకు ఖాతాల్లో పెద్ద మొత్తాల్లో డబ్బులు డిపాజిట్ చేసిన బడాబాబుల్లో కొందరు ఐటీ రిటర్న్స్  ఫైల్ చేయలేదు.

దేశ వ్యాప్తంగా ఇలాంటి వ్యక్తులు, సంస్థలు, భాగస్వామ్య సంస్థలు 10,238 వరకు ఉన్నాయి.వీటిలో 681 మంది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారని చెప్పారు. రిటర్న్స్ దాఖలు చేయని ఈ 681 మందిలో కూడా  448 మంది హైదరాబాద్ ప్రాంతానికి చెందినవారు, 153 మంది విజయవాడ ప్రాంతం వాళ్ళు కాగా మిగతా  80 మంది విశాఖ ప్రాంతానికి చెందిన వారని వివరించారు. 
పెద్దనోట్ల రద్దు సమయంలో మీ బ్యాంకు ఖాతాల్లో రూ.కోటి కంటే ఎక్కువ మొత్తాల్లో డిపాజిట్లు చేస్తే కష్టాలను ఎదుర్కొన్నట్టే . ఈ నెలాఖరులోగా ఫైల్ చేసే ఐటీ రిటర్న్స్లో ఆ ఆదాయానికి సంబంధించి సరైన లెక్కలు చూపించాలి లేని పక్షంలో ఇబ్బందులే మరి. ఇలాంటి  వ్యక్తుల వ్యాపార కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలు నిరంతరం తమ నిఘాలు ఉన్నట్లు ఐటీ అధికారులు పేర్కొంటున్నారు. 
.
.

Related Posts