YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

యుపి లో ఆటవిక పాలన సాగుతోంది: అఖిలేష్ యాదవ్ ధ్వజం

యుపి లో ఆటవిక పాలన సాగుతోంది: అఖిలేష్ యాదవ్ ధ్వజం

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

ఉత్తరప్రదేశ్‌లో ఆటవిక పాలన సాగుతోందని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ధ్వజమెత్తారు. ఉన్నావ్ బాధితురాలి రోడ్డు ప్రమాదంలో బీజేపీ హస్తముందని ఆయన ఆరోపించారు. ప్రతిపక్షాలు సైతం బీజేపీ ప్రమేయం ఉందంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. అయితే అది ప్రమాదమేనని బీజేపీ చెప్పుకొస్తోంది. ఇందులో బంగర్మవు నుంచి నాలుగు సార్లు శాసన సభ్యుడిగా ఎన్నికైన కుల్దీప్ సింగ్ సెంగార్ నిందితుడిగా విచారణ ఎదుర్కొంటున్నారు.‘‘బేటి పడావో-బీటీ బచావో అంటూ బీజేపీ నేతలు బాగానే ప్రగల్బాలు చెబుతారు. కానీ, ఆచరణలో వారు దీనికి పూర్తి విరుద్ధం. ఉన్నావ్ అత్యాచార నిందితుడు బీజేపీ ఎమ్మెల్యే. ఇంకా ఆయనను ప్రశ్నించడం అనవసరం’’ అని అఖిలేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘‘ఈ కేసులో నిందితుడు బీజేపీ నేతనే. రాష్ట్రంలో పాలన బీజేపీదే. అందుకే ఇన్ని రోజులైనా బాదితురాలికి న్యాయం జరగలేదు. రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోంది. నేరస్థులు స్వైర విహారం చేస్తున్నారు. బాదితులు నోరు విప్పడానికి జంకుతున్నారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కాకుండా సీబీఐ చేత విచారణ చేయించాలని అఖిలేష్ డిమాండ్ చేశారు.ఉన్నావ్ అత్యాచార బాదితురాలు, తన లాయర్ సహా కుటుంబ సభ్యులతో కారులో ప్రయాణిస్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఇద్దరు కుటుంబ సభ్యులు ప్రమాద స్థలంలోనే మరణించారు. బాదితురాలు, లాయర్‌ల పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారని, వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. రాయ్ బరేలి జిల్లాలో ఆదివారం జరిగిందీ సంఘటన.

Related Posts