యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
దేశ విభజనతో మూతపడిన పాకిస్థాన్‌లోని వెయ్యేళ్ల నాటి చారిత్రక హిందూ దేవాలయంలో మళ్లీ పూజలు ఆరంభమయ్యాయి. లాహోర్‌కు 100 కిలోమీటర్ల దూరంలోని, సియాల్‌కోట్‌లో ఉన్న ‘శావాలా తేజ్‌సింహ్’ శివాలయం... దేశ విభజన సమయంలోనే ధూపదీప నైవేద్యాలకు దూరమైంది. దాడుల్లో కొంతమేర దెబ్బతింది. చారిత్రక ఆలయమైనందున దీన్ని పునరుద్ధరించాలని భావించి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పనులు దాదాపు కొలిక్కి రావడంతో దేవాలయాన్ని తెరిచి, స్థానిక హిందువులకు ప్రవేశం కల్పిస్తున్నారు.