యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌ను సెర్బియా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాన్‌పిక్ కేసులో నిమ్మగడ్డ ప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రస్ అల్ ఖైమాకు చెందిన ప్రతినిధుల ఫిర్యాదుతో బెల్‌గ్రేడ్‌లో నిమ్మగడ్డను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వాన్‌పిక్ వాటాల వ్యవహారంలో నిమ్మగడ్డపై రస్ అల్ ఖైమా ఫిర్యాదు చేసింది. రస్ అల్ ఖైమా నూతన సీఈవో ఫిర్యాదుతో ఇంటర్‌పోల్ రంగంలోకి దిగింది. రెండ్రోజుల క్రితమే పోలీసులు అదుపులోకి తీసుకోగా ఈ ఘటనకు ఆలస్యంగా వెలుగు చూసింది.సెర్బియాలో విహారయాత్రకు వెళ్లగా అక్కడే ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే నిమ్మగడ్డను భారత్‌కు తీసుకువచ్చేందుకు వైసీపీ ఎంపీల ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ మేరకు సెర్బియాతో సంప్రదింపులు జరపాలంటూ విదేశాంగమంత్రి జైశంకర్‌కు వైసీపీ ఎంపీలు లేఖ రాశారు. నిమ్మగడ్డను అరెస్ట్ చేయకుండా సురక్షితంగా ఇండియాకు పంపించేలా చర్యలు తీసుకోవాలని లేఖలో ఎంపీలు కోరారు. ప్రస్తుతం ఈ లేఖ చర్చనీయాంశమైంది. కాగా.. నిమ్మగడ్డకు వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితో మంచి సంబంధాలున్న సంగతి తెలిసిందే.